Nalgonda: ఖేలో ఇండియా హాకీ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ!

Nalgonda: నల్లగొండ నుంచి ధ్యాన్‌చంద్ వంటి క్రీడాకారులు రావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకాంక్ష. మేకల అభినవ్ స్టేడియంలో ఖేలో ఇండియా హాకీ ప్లేయర్లకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ.

Saleem, Nalgonda
Published on: 17 Sept 2026 10:28 PM IST
Nalgonda
X

Nalgonda: ఖేలో ఇండియా హాకీ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ!

నల్గొండ: నల్గొండ జిల్లా నుంచి ధ్యాన్‌చంద్ వంటి దిగ్గజ క్రీడాకారులు రావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురువారం నగరంలోని మేకల అభినవ స్టేడియంలో ఖేలో ఇండియా కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న హాకీ క్రీడాకారులకు ఆయన క్రీడా సామగ్రిని అందజేశారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరంతర కృషి, పట్టుదలతో ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూ. 2 లక్షల వ్యయంతో అందించిన ఈ సామగ్రిని 40 మంది క్రీడాకారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇండియా ప్రాబబుల్స్‌కు ఎంపికైన గణేష్, రాకేష్‌లను ఆయన అభినందించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda