Nalgonda: బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో నల్గొండ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Nalgonda: నల్గొండ బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ బి. చంద్రశేఖర్ తనిఖీ చేశారు. టెన్త్ టాపర్లను మంత్రి కోమటిరెడ్డి సొంత ఖర్చుతో ఢిల్లీ తీసుకెళ్తారని తెలిపారు.

Saleem, Nalgonda
Published on: 24 Oct 2026 3:52 PM IST
Nalgonda
X

Nalgonda: బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో నల్గొండ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన ప్రమాణాలు, మౌలిక వసతులను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.

​ఈ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ర్యాంకులు సాధించే విద్యార్థులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చులతో ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రకటించారు. విమాన ప్రయాణ ఖర్చులతో పాటు షాపింగ్ ఖర్చులను కూడా మంత్రే భరిస్తారని తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda