Nalgonda: పీఎం శ్రీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి!
Nalgonda: నల్లగొండ జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలల నిర్వహణపై కలెక్టర్ బి. చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Nalgonda: పీఎం శ్రీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి!
Nalgonda: పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. చదువుతో పాటు సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పాఠశాలల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలల వాతావరణం రొటీన్‌కు భిన్నంగా ఉండాలని స్పష్టం చేశారు.
Next Story




