Nalgonda: జీకే అన్నారంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: నల్గొండ మండలం జీకే అన్నారంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. లబ్ధిదారులతో ముఖాముఖి.

Saleem, Nalgonda
Published on: 7 Nov 2026 9:03 PM IST
Nalgonda
X

Nalgonda: జీకే అన్నారంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ: పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన గృహాల్లో "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

​శనివారం నల్గొండ మండలంలోని జీకే అన్నారం గ్రామంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారురాలు పేర్ల లక్ష్మమ్మ నిర్మించుకున్న నూతన గృహంలో లబ్ధిదారులతో కలిసి ప్రవేశం చేయించారు.

అనంతరం లబ్ధిదారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు తినిపిస్తూ ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడం వల్ల తమ జీవితాల్లో వెలుగులు నిండాయని, సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు లక్ష్మమ్మ, రజితలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda