Nalgonda: ఆజాద్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: కలెక్టర్!

Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకల్లో కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Saleem, Nalgonda
Published on: 11 Nov 2026 6:06 PM IST
Nalgonda
X

Nalgonda: ఆజాద్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: కలెక్టర్!

నల్గొండ: స్వతంత్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పోరాట స్ఫూర్తిని, ఆలోచనా దృక్పథాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధేయ మార్గంలో పయనిస్తూ స్వదేశీ, సత్యాగ్రహ, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో ఆజాద్ కీలక పాత్ర పోషించారన్నారు. జర్నలిజం ద్వారా ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిలించారని, దేశంలో తొలి విద్యా విధానాన్ని రూపొందించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. విద్యా రంగానికి చేసిన సేవలకుగాను ప్రభుత్వం 1992లో ఆయనకు 'భారతరత్న' పురస్కారాన్ని అందజేసిందని గుర్తుచేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda