Nalgonda: ప్రాథమిక స్థాయిలోనే విద్యా సామర్థ్యాలు పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్!
Nalgonda: నల్గొండ మండలం కంచనపల్లి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nalgonda: ప్రాథమిక స్థాయిలోనే విద్యా సామర్థ్యాలు పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్!
నల్గొండ: విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుంచే కనీస విద్యా సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ మండలం కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోని విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తెలుగు, ఆంగ్ల భాషల్లో స్పష్టంగా చదవడం, రాయడంతో పాటు పదాల అర్థాలను సులభంగా గ్రహించేలా బోధించాలని స్పష్టం చేశారు.
Next Story




