Nalgonda: ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.
Nalgonda: ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి!
Nalgonda: నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఎన్నికల గోదామును జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు.వివిధ పార్టీల తరఫున హాజరైన ప్రతినిధుల సమక్షంలో ఈ వి ఎం గోదామును తెరిపించి గోదాంలో భద్రపరిచిన ఈ వి ఎం లు,వివి ప్యాడ్లు చూపించారు.
ఈవీఎం గోదాం వద్ద భద్రత, ఇతర విషయాలను జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్లు పరిశీలించడం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వి ఎం గోదామును పరిశీలించారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎండి ముంతాజ్ అలీ, బిజెపి నుండి పి.లింగస్వామి, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అద్దంకి రవి, బీఎస్పీ నుండి ఆర్ .రవిశంకర్, టిఆర్ఎస్ నుండి పిచ్చయ్య, సిపిఐ ఎం నుండి సైదులు, టిడిపి నుండి తేలు అన్న రవి, ఏఐఎంఐఎం నుండి కాజా గౌస్ మోహియుద్దీన్ లు ఉన్నారు.




