Nalgonda: నల్లగొండ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చంద్రశేఖర్!

Nalgonda: నల్లగొండ జిల్లా హాలియాలో ఎన్ఎస్పీ కాలువ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్. గజ ఈతగాళ్లు, కట్టుదిట్టమైన భద్రతకు ఆదేశం.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 18 Sept 2026 7:31 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చంద్రశేఖర్!

Nalgonda: వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.నల్గొండ జిల్లా, హాలియా మున్సిపల్ పరిధిలోని 14వ మైలురాయి సమీపంలో వినాయక నిమజ్జనం నిర్వహించే నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందే చేయాలని, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.

ఎన్ఎస్పి ప్రధాన కాలువలో ఈనెల 22 నుండి 25 వరకు నీరు తగ్గకుండా ఒకే స్థాయిలో ఉండేలా చూడాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .నిమజ్జనం సందర్భంగా ఎన్ఎస్పీ కాలువ వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఆపదమిత్ర వాలంటీర్ల సహకారం తీసుకోవాలని, పోలీసు తో పాటు, 12 వ బెటాలియన్ పోలీసు సేవలను సిద్ధంగా ఉంచడం జరుగుతుందని, స్థానిక గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

పోలీసు అధికారులు నాలుగు రోజులపాటు 24 గంటలు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని,వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత వెంటనే చెత్తను బయటికి తీసివేసేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం సవ్యంగా సాగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, నిమజ్జనానికి కావాల్సిన క్రేన్లు, వాహనాలు, ఇతర సామాగ్రి వంటి ఏర్పాట్లు అన్ని ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET