Nalgonda: అన్నేపర్తి 12వ బెటాలియన్‌లో కమాండెంట్ వార్షిక తనిఖీ

Nalgonda: అన్నేపర్తిలోని 12వ తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ హెచ్‌క్యూ కంపెనీలో కమాండెంట్ బి.రామకృష్ణ వార్షిక తనిఖీ నిర్వహించి విభాగాలను పరిశీలించారు.

Saleem, Nalgonda
Published on: 28 Nov 2026 6:29 PM IST
Nalgonda
X

Nalgonda: అన్నేపర్తి 12వ బెటాలియన్‌లో కమాండెంట్ వార్షిక తనిఖీ

నల్గొండ: అన్నేపర్తిలోని 12వ తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ (టీజీఎస్పీ) హెచ్‌క్యూ కంపెనీలో కమాండెంట్ బి.రామకృష్ణ వార్షిక తనిఖీ నిర్వహించారు.

కార్యాలయాలు, బ్యారక్స్, మెస్, ఆయుధాగారం, ఆసుపత్రి విభాగాలతో పాటు రికార్డులు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

సిబ్బందికి కవాతు, డ్రిల్, ఆయుధ శిక్షణ సామర్థ్యాన్ని సమీక్షించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda