Nalgonda: నల్గొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.

Saleem, Nalgonda
Published on: 20 Aug 2026 10:34 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ సెంటర్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

​ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. యువతకు ఓటు హక్కు కల్పించిన మహానీయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story