Nalgonda: ఢిల్లీ మహా ర్యాలీ బస్సులను ప్రారంభించిన పున్న కైలాష్ నేత!

Nalgonda: నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి మహా ర్యాలీకి నల్గొండ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల బస్సులను డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ప్రారంభించారు.

Saleem, Nalgonda
Published on: 30 Oct 2026 7:48 AM IST
Nalgonda
X

Nalgonda: ఢిల్లీ మహా ర్యాలీ బస్సులను ప్రారంభించిన పున్న కైలాష్ నేత!

నల్గొండ: నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ర్యాలీకి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. శుక్రవారం నల్గొండ నియోజకవర్గం నుంచి బయలుదేరిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, జిల్లా డెలిగేట్స్, బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల ప్రత్యేక బస్సులను జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జెండా ఊపి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఇండియా కూటమి పిలుపునిచ్చిన ఈ మహా ర్యాలీని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్న కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda