Nalgonda: నల్గొండ ఆయిల్ పామ్ సాగుపై సీఆర్‌బీ బృందం అధ్యయనం

Nalgonda: నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై 'సీఆర్‌బీ' బృందం పర్యటన. సేంద్రియ ఎరువుల వాడకం, మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు నిపుణుల సూచనలు.

Saleem, Nalgonda
Published on: 14 July 2026 7:03 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ ఆయిల్ పామ్ సాగుపై సీఆర్‌బీ బృందం అధ్యయనం

నల్గొండ: నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ స్థిరమైన సాగు పద్ధతులపై అధ్యయనం చేసేందుకు 'సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్' (CRB) బృందం పర్యటించింది.

పెద్దవూర మండలం మిట్టపల్లిలో రైతు శ్రీనివాస్ ఆయిల్ పామ్ తోటను సందర్శించి, అంతర పంటల సాగును పరిశీలించింది. రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని నిపుణులు సూచించారు.

అనంతరం పతంజలి నర్సరీని, నిడమనూరు మండలం వేంపాడలో రైతు శేఖందర్ రావు తోటను సందర్శించి దిగుబడుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి టి. శేఖర్, సీఆర్‌బీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story