Nalgonda: మిర్యాలగూడలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 11:02 AM IST
Nalgonda
X

Nalgonda: మిర్యాలగూడలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

నల్లగొండ/మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ దుశ్చర్యపై ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

​మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డీఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో అబలలపై అగైత్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story