Devarakonda: విద్యార్థుల ప్రాణాలతో లక్ష్య పాఠశాల చెలగాటం: ఎనమల్ల నవీన్!

Devarakonda: నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో రైస్ మిల్లులు, పెట్రోల్ బంక్, సిమెంట్ బ్రిక్స్ తయారీ మధ్య నడుస్తున్న లక్ష్య పాఠశాల అనుమతులు రద్దు చేయాలని ఏఐవైఎఫ్ నేత ఎనమల్ల నవీన్ డిమాండ్ చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 17 Nov 2026 11:44 AM IST
Devarakonda
X

Devarakonda: విద్యార్థుల ప్రాణాలతో లక్ష్య పాఠశాల చెలగాటం: ఎనమల్ల నవీన్!

దేవరకొండ: గుండ్లపల్లి మండల కేంద్రంలో లక్ష్య పాఠశాల పేరుతో పర్మిషన్ తెచ్చుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లక్ష్య పాఠశాల యజమాన్యం సోమవారం స్థానిక గుండ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి గుండ్లపల్లి మండల స్థాయి ప్రజావాణిలో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నవీన్,డిండి మండల అధ్యక్షులు కాంపల్లి ప్రవీణ్ ఉపాధ్యక్షులు నూనె భూపాల్ ఆధ్వర్యంలో లక్ష్య పాఠశాలకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు అంటూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది.

అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ ఆ పాఠశాల ఏ వాతావరణంలో నడుపుతున్నారు పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారా ఇస్తే ఎంఈఓ గారు ఏం చేస్తున్నారు ఆ పాఠశాలకు ఒకపక్క పల్లీల మిల్లు మరియు రైస్ మిల్లు, మరొకపక్క రైస్ మిల్లు, ఒకపక్క పెట్రోల్ బంక్, మరొకపక్క సిమెంట్ బ్రిక్స్ తయారీ దుమ్ముతో కూడుకున్నటువంటి ప్రాంతంలో నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు పాఠశాల నడుపుతూ విద్యార్థుల ఆరోగ్యం మరియు ప్రాణాలతో చెలగాటమాడుతున్న లక్ష్య పాఠశాల యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఆ పాఠశాల అనుమతులను రద్దు చేయాలని విద్యార్థుల ఆరోగ్యాలు మరియు వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలి నాలి చేసి ఈ కష్టకాలంలో తమ బిడ్డ బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏది ఆలోచించకుండా ఈ పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. అందులో చదివే విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారని కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను ఆ పాఠశాల మాన్పించి వేరే పాఠశాలలో జాయిన్ చేయడం కూడా జరిగిందనీ. విద్యార్థుల ఫీజు విషయంలో కూడా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి ఫీజులు వసూల్లు చేస్తున్నారు.

ఒకపక్క ప్రమాదంగా పొంచి ఉన్న పెట్రోల్ బంక్ పక్కనే ఈ పాఠశాల నడపడం చాలా దారుణమని అనుకోని సందర్భంలో ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) పక్షాన అధికారులను అడుగుతున్నాం. తక్షణమే ఈ యొక్క లక్ష్య పాఠశాల పైన చర్యలు తీసుకొని వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న లక్ష్య యజమాన్యం పై చర్యలు తీసుకొని వాటి అనుమతులను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని వెంటనే జిల్లా విద్య అధికారి డీఈవో గారు మరియు ఎంఈఓ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA