Devarakonda: డాక్యా తండాలో నాటుసారా స్థావరంపై ఎక్సైజ్ దాడులు!

Devarakonda: నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం డాక్యా తండాలో ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి చేసి 20 లీటర్ల నాటుసారా, 180 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని మహిళపై కేసు నమోదు చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 1 Nov 2026 8:11 PM IST
Devarakonda
X

Devarakonda: డాక్యా తండాలో నాటుసారా స్థావరంపై ఎక్సైజ్ దాడులు!

దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ ఈరోజు ఉదయం అనగా తేదీ 01.11.2026 నాడు దేవరకొండ ఎక్సైజ్ SHO ఆధ్వర్యంలో గుండ్లపల్లి మండలం డాక్యా తండా గ్రామంలో నాటు సారాయి స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఒక మహిళపై కేసు నమోదు చేశారు.

ఆమె వద్ద నుండి 20 లీటర్ల నాటు సారాయి, 180 కిలోల నల్ల బెల్లం, 90 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీ మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవరకొండ ఎక్సైజ్ ఇన్‌ఛార్జ్ సీఐ జి. హరికృష్ణ తెలిపారు. ఈ రైడ్ లో ఎక్సైజ్ ఎస్ఐ మం. గురువయ్య, సిబ్బంది క్రాంతి, సురేష్ లు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA