Nalgonda: గల్లీకో బెల్ట్ షాపు ఎంఆర్పి కంటే అధిక ధరకు మద్యం విక్రయాలు!
Nalgonda: నల్లగొండ జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ బెల్ట్ షాపులు. బాటిల్‌పై రూ.20 నుండి రూ.50 వరకు అదనపు వసూళ్లు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు.
Nalgonda: గల్లీకో బెల్ట్ షాపు ఎంఆర్పి కంటే అధిక ధరకు మద్యం విక్రయాలు!
Nalgonda: గల్లీకో బెల్ట్ షాపు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వైన్ షాపుల నిర్వాహకులు ఒక్కో దుకాణానికి అనుబంధంగా 15 వరకు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కిరాణా, డబ్బా కొట్లలో సైతం మద్యం విక్రయిస్తూ ప్రతీ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో నాలుగైదు షాపులు ఏర్పడుతున్నా ఎక్సైజ్ శాఖ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Next Story




