Nalgonda: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు 300 రోజుల యాక్షన్ ప్లాన్: కలెక్టర్!

Nalgonda: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 300 రోజుల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 19 Oct 2026 5:22 PM IST
Nalgonda
X

Nalgonda: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు 300 రోజుల యాక్షన్ ప్లాన్: కలెక్టర్!

నల్గొండ: రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో 300 రోజుల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే ఆగస్టు వరకు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో నీటి వనరుల రిజిస్టర్లు నిర్వహించాలని, లీకేజీలను అరికట్టి పాడైన పైపులు, ట్యాంకులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda