Nalgonda: ఏఈఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్!
Nalgonda: టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలను లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ఎస్‌పీఆర్ హైస్కూల్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nalgonda: ఏఈఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్!
నల్గొండ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఈఈ (సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌అండ్‌బీ) పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌పీఆర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్, టాయిలెట్లు తదితర మౌలిక వసతులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలన్నారు.




