Nalgonda: నల్గొండ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు!

Nalgonda: గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లాలో రేపు (బుధవారం) అన్ని విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 22 Sept 2026 5:09 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు!

Nalgonda: రేపు నల్గొండ జిల్లాలోని విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది.గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా రేపు (బుధవారం) జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇస్తూ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.​

నిమజ్జనం వేళ రహదారులపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.ఇక ఈ సెలవుకు బదులుగా వచ్చే నెల 10వ తేదీన (రెండవ శనివారం) విద్యాసంస్థలు వర్కింగ్ డేగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. కలెక్టర్ ఉత్తర్వులను అధికారులు, యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET