Nalgonda: నల్లగొండ జిల్లాలో భగ్గుమంటున్న పప్పు దినుసుల ధరలు!
Nalgonda: నల్లగొండ జిల్లాలో కంది, పెసర, మినుము, శనగపప్పు ధరలు నెల వ్యవధిలోనే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
Nalgonda: నల్లగొండ జిల్లాలో భగ్గుమంటున్న పప్పు దినుసుల ధరలు!
నల్గొండ: నల్గొండ జిల్లాలో ప్రధానమైన కంది, పెసర, మినుము, శనగపప్పు ధరలు నెల వ్యవధిలోనే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
సబ్సిడీ లేకపోవడం, అనావృష్టితో పంటలు ఎండిపోతుండటంతో రైతులు పప్పు దినుసుల సాగుకు దూరంగా ఉంటున్నారని, మరో వారంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.




