Nalgonda: సూర్యవంశీ కాలనీలో సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన డీఎస్పీ శివరాంరెడ్డి
Nalgonda: నల్గొండ సూర్యవంశీ కాలనీలో 30 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ శివరాంరెడ్డి. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని కాలనీ వాసులకు అభినందనలు.
Nalgonda: సూర్యవంశీ కాలనీలో సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన డీఎస్పీ శివరాంరెడ్డి
నల్లగొండ: నల్గొండ పట్టణంలోని సూర్యవంశీ కాలనీలో కాలనీ వాసులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన 30 సీసీటీవీ కెమెరాలను నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ప్రారంభించారు.కాలనీ వాసులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి 30 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని, తమ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడం అభినందనీయమని డీఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులను పోలీస్ శాఖ తరఫున అభినందించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తులో కీలకమైన ఆధారాలను అందిస్తాయని తెలిపారు.
కాలనీలు, ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని సూచించారు.ప్రజల భద్రత కోసం పోలీసులకు సహకరిస్తూ, ప్రతి కాలనీ వాసి బాధ్యతగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. సూర్యవంశీ కాలనీ వాసుల చొరవ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.




