Nalgonda: నల్లగొండలో సిపిఎం నాయకుల అరెస్టుపై డివైఎఫ్ఐ నిరసన

Nalgonda: నల్లగొండ సుందరయ్య భవనంలోకి పోలీసులు ప్రవేశించి సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సంఘ నాయకులు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 15 Aug 2026 6:24 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో సిపిఎం నాయకుల అరెస్టుపై డివైఎఫ్ఐ నిరసన

​నల్లగొండ: స్థానిక సుందరయ్య భవనంలోకి పోలీసులు ప్రవేశించి సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులపై దాడి చేసి, గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌లో బంధించడాన్ని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.

నల్లగొండలో శనివారం నిర్వహించిన సమావేశంలో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, మండల కార్యదర్శి కండె యాదగిరి, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మరుపాక కిరణ్ మాట్లాడారు.

​ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రతినిధులు, నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదని, రక్షణగా ఉండాల్సిన వారే దాడికి పాల్పడటం విస్మయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story