Nalgonda: ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే!
Nalgonda: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో లంచాలు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపణ. పారదర్శకంగా మళ్లీ డ్రా తీయాలని డిమాండ్.
Nalgonda: ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే!
Nalgonda: నల్గొండ పట్టణంలో ప్రభుత్వ పనితీరు, స్థానిక పాలనపై మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అర్హులను పారదర్శక డ్రా పద్ధతిలో ఎంపిక చేశామని, ప్రస్తుత పాలనలో నిబంధనలకు విరుద్ధంగా లంచాలు తీసుకుని ఇళ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. అర్హులకు న్యాయం జరిగేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తిరిగి డ్రా తీయాలని డిమాండ్ చేశారు.
Next Story




