Nalgonda: కరెంట్ కోతలపై విరుచుకుపడ్డ రైతన్న.. సబ్‌స్టేషన్ వద్ద నిరసన!
Nalgonda: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.
Nalgonda: కరెంట్ కోతలపై విరుచుకుపడ్డ రైతన్న.. సబ్‌స్టేషన్ వద్ద నిరసన!
Nalgonda: నిరంతర విద్యుత్ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయంటూ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు తీవ్ర నిరసన తెలిపారు. తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గోడల లాంటి వరినార్లు ఎండిపోతుంటే అధికారులు కనీసం స్పందించడం లేదని, ఫోన్లు చేసినా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని, ఈ విషయంలో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని బాధితులు డిమాండ్ చేశారు.
Next Story




