Kethepally: సమత హోటల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం!
Kethepally: కేతేపల్లి సమత హోటల్ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచన.
Kethepally: సమత హోటల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం!
Kethepally: కేతేపల్లి మండల కేంద్రం, సమత హోటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హోటల్‌కు వచ్చే వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందించడంతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, హోటల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.




