Nakrekal: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే వీరేశం
Nakrekal: నకిరేకల్ నియోజకవర్గంలో 256 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.
Nakrekal: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 256 మంది లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ.23 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేదలకు అందించినట్లు వెల్లడించారు. గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఏనాడూ సంక్షేమ పథకాలు అందలేదని మండిపడ్డారు.
ఇక విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని, కడపర్తి సమీపంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. అలాగే, మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. తాజాగా రెండో విడతలో మరో రెండు వేల ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులందరికీ పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తామని భరోసానిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రావట్లేదని విమర్శించారు.




