Nalgonda: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కంచర్ల!

Nalgonda: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda
Published on: 14 Oct 2026 4:08 PM IST
Nalgonda
X

Nalgonda: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కంచర్ల!

నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పట్టభద్రులు, యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెప్పాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

​ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పలువురి ఇళ్లకు వెళ్లిన ఆయన వారి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేలా గ్రాడ్యుయేట్లు బాధ్యత తీసుకోవాలని కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda