Nalgonda: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి

Nalgonda: నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయం, నార్కట్‌పల్లి ఠాణాను మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీ చేసి కీలక ఆదేశాలు ఇచ్చారు.

Saleem, Nalgonda
Published on: 28 Nov 2026 6:46 PM IST
Nalgonda
X

Nalgonda: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి

నల్గొండ: గంజాయి, డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం ఆదేశించారు. శనివారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయం, నార్కట్‌పల్లి ఠాణాను ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి తనిఖీ చేశారు.

అధికారులతో సమీక్ష నిర్వహించి, నిరంతర పెట్రోలింగ్, నాకాబందీతో నేరాలను అరికట్టాలన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి సత్వర న్యాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda