Nalgonda: నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు
Nalgonda: నల్గొండలో వరుస పగటి చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు. ఢిల్లీకి చెందిన కరడుగట్టిన దొంగ మహమ్మద్ నసీమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.
Nalgonda: నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు
నల్గొండ: నల్గొండ జిల్లాలో వరుస పగటి చోరీలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఖాకీ సినిమాను తలపించే రీతిలో సాగిన ఈ ఆపరేషన్‌లో ఢిల్లీకి చెందిన కరడుగట్టిన దొంగ మహమ్మద్ నసీమ్‌ను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో.. వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ ఎస్సై సైదాబాబు నేతృత్వంలోని బృందం ఉత్తరప్రదేశ్, ఘాజియాబాద్, ఢిల్లీ వరకు వెళ్లి మరీ ఈ ఆపరేషన్ నిర్వహించింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా పానగల్ బైపాస్ వద్ద పక్కా వ్యూహంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం నల్గొండలోనే కాకుండా ఏపీలోని నెల్లూరు, తిరుపతితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు తేలింది. నిందితుడి వద్ద నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నగదు, స్కూటీ, చోరీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇర్షాద్, షరీఫ్‌ల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.




