Kanagal: కనగల్ మండలంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి!

Kanagal: నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు.

Saleem, Nalgonda
Published on: 20 Sept 2026 2:25 PM IST
Kanagal
X

Kanagal: కనగల్ మండలంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి!

Kanagal: నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అమలువుతున్న విద్యుత్ సరఫరా తీరుపై అధికారులను, స్థానిక రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి పంపుసెట్లకు నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. లో-వోల్టేజీ సమస్యలు, తరచూ విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సబ్‌స్టేషన్లలో సాంకేతిక లోపాలను సరిదిద్ది, రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉచిత విద్యుత్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda