Nalgonda: నల్గొండలో ఘనంగా 'జిజ్ఞాస' రాష్ట్రస్థాయి బహుమతుల ప్రదానోత్సవం!

Nalgonda: నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 'జిజ్ఞాస' రాష్ట్రస్థాయి బహుమతుల ప్రదానోత్సవం. విజేతలకు నగదు పురస్కారాలు అందజేసిన అడిషనల్ ఎస్పీ రమేష్.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 6 Nov 2026 2:57 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో ఘనంగా 'జిజ్ఞాస' రాష్ట్రస్థాయి బహుమతుల ప్రదానోత్సవం!

Nalgonda: ​నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'జిజ్ఞాస' స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయి బహుమతుల బహూకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ సిసిఈ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించిన విద్యార్థులు, గైడ్ సూపర్‌వైజర్లకు ఆయన నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.

​ఈ పోటీల్లో నల్గొండ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉర్దూ విభాగంలో ప్రథమ స్థానం, బయోటెక్నాలజీలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. అలాగే హుజూర్ నగర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు కామర్స్ విభాగంలో ప్రతిష్టాత్మక బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రవికుమార్, శ్రీనివాసులు, జిజ్ఞాస కోఆర్డినేటర్లు, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET