Nalgonda: ఆస్ట్రేలియా ఎన్నికల్లో నల్లగొండ జిల్లా యువకుడి పోటీ!
Nalgonda: నల్లగొండ జిల్లా కనగల్ మండలం గోగుబుచ్చయ్యగూడెం యువకుడు యర్ర సాగర్‌రెడ్డి ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో 'ది రిపబ్లికన్' పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Nalgonda: ఆస్ట్రేలియా ఎన్నికల్లో నల్లగొండ జిల్లా యువకుడి పోటీ!
నల్గొండ: కనగల్ మండలం గోగుబుచ్చయ్యగూడెంకు చెందిన 31 ఏళ్ల యువకుడు యర్ర సాగర్‌రెడ్డి ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్రం విలియమ్స్‌టౌన్ నుంచి 'ది రిపబ్లికన్' పార్టీ అభ్యర్థిగా ఎన్నారై కోటాలో ఆయన బరిలోకి దిగారు.
ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన, సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొంది ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో సాగర్‌రెడ్డి గెలవాలని స్వగ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.




