Nalgonda: హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 ఆరు వరుసల విస్తరణకు శ్రీకారం!

Nalgonda: హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 ఆరు వరుసల విస్తరణకు భూసేకరణ నోటిఫికేషన్. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో 6.32 హెక్టార్ల భూముల సేకరణకు కేంద్రం నిర్ణయం.

Saleem, Nalgonda
Published on: 13 Sept 2026 11:26 AM IST
Nalgonda
X

Nalgonda: హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 ఆరు వరుసల విస్తరణకు శ్రీకారం!

Nalgonda: హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రహదారి, రవాణా శాఖ భూసేకరణ ప్రక్రియను చేపట్టింది. నల్గొండ జిల్లాలోని 62.20 కి.మీ నుండి 126.800 కి.మీ పరిధిలో విస్తరణ కోసం జాతీయ రహదారుల చట్టం-1956 సెక్షన్ 3ఎ(1) ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో ఉన్న 70 సర్వే నంబర్ల నుండి 6.32 హెక్టార్ల భూములను సేకరించనున్నారు. ఆభ్యంతరాలు ఉన్నవారు 21 రోజుల్లోగా ఆర్‌డీఓకు నివేదించవచ్చు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda