Nalgonda: నల్లగొండలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం!
Nalgonda: నల్లగొండలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Nalgonda: నల్లగొండలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం!
Nalgonda: గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత రోజులో కొన్ని గంటలైనా సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలు చదవాలని సూచించారు.
సమాజంలో చదివే సంస్కృతిని పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పాఠకులు, నిరుద్యోగుల కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఏ. హాఫిజ్ ఖాన్, డిప్యూటీ మేయర్, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.




