Nalgonda: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని వెల్లడి.

Saleem, Nalgonda
Published on: 19 Oct 2026 5:14 PM IST
Nalgonda
X

Nalgonda: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: రాష్ట్ర ప్రజలకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.

​కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సోదరభావం, ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని సూచించారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఈ విజయదశమి శుభాలను తీసుకురావాలని కోరారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న మంత్రి... తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించాలని, ప్రజల ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda