Nalgonda: మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!
Nalgonda: నల్లగొండ మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో జయశంకర్ జయంతి ఘనంగా జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి మంత్రి కోమటిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Nalgonda: మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!
నల్లగొండ జిల్లా: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ పడిన తపన, చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
Next Story




