Nalgonda: నల్లగొండలో ఎంపీ రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం.. హాజరైన మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యుడు (MP) కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
Nalgonda: నల్లగొండలో ఎంపీ రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం.. హాజరైన మంత్రి కోమటిరెడ్డి!
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి.. ఎంపీ రఘువీర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు కార్యాలయం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కార వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
Next Story




