Nalgonda: మిర్యాలగూడ రైస్ మిల్లులో విజిలెన్స్ దాడులు!
Nalgonda: మిర్యాలగూడ కిష్టాపురంలోని శ్రీ లలిత రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. 2022–23 సీఎంఆర్ బియ్యం నిల్వల లెక్కింపులో భారీ వ్యత్యాసాలు గుర్తింపు.
Nalgonda: మిర్యాలగూడ రైస్ మిల్లులో విజిలెన్స్ దాడులు!
Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురంలోని శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీలో సోమవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి మిల్లుకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం నిల్వల లెక్కింపులో భారీగా తేడాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యానికి తగినంతగా తిరిగి బియ్యం అప్పగించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, ఫలితంగా సర్కారు ఖజానాకు విపరీతమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. మిల్లులోని ప్రస్తుత ధాన్యం, బియ్యం నిల్వలతో పాటు పాత రికార్డులను అధికారులు జల్లెడ పడుతున్నారు.
ఈ అక్రమాల వెనుక ఎవరి హస్తముందనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.




