Nalgonda: పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి!

Nalgonda: నల్గొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి.

Saleem, Nalgonda
Published on: 16 Aug 2026 11:30 AM IST
Nalgonda
X

Nalgonda: పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి!

Nalgonda: ​లక్షలాది మంది పేదల సొంత ఇళ్ల కలను నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

​గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదోడి సొంతింటి కలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ఆశ చూపి ఓట్లు దండుకోవడం తప్ప, పేదలకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన పేదలందరికీ ఇళ్లను పంపిణీ చేస్తూ ఆదుకుంటోందని పేర్కొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story