Nalgonda: పేద, మధ్యతరగతి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం విప్ వేముల వీరేశం!

Nalgonda: కేతేపల్లి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

Saleem, Nalgonda
Published on: 15 Sept 2026 1:25 PM IST
Nalgonda
X

Nalgonda: పేద, మధ్యతరగతి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం విప్ వేముల వీరేశం!

Nalgonda: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. కేతేపల్లి మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు సంక్షేమ ఫలాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda