Nalgonda: అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారం: రఘువీర్ రెడ్డి

Nalgonda: ప్రాజెక్టులు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తాం: నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ధీమా!

Saleem, Nalgonda
Published on: 29 Jun 2026 5:34 PM IST
Nalgonda
X

Nalgonda: అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారం: రఘువీర్ రెడ్డి

నల్గొండ జిల్లా: అభివృద్ధిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో తాము పోటాపోటీగా శ్రమిస్తున్నామని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ప్రస్తావిస్తూ... జిల్లాలో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన తర్వాతే ఎన్నికల బరిలోకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని, రాబోయే రోజుల్లో జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతామని ఎంపీ పునరుద్ఘాటించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story