Nalgonda: పాత పుస్తకాలతో కొత్త నోట్‌బుక్స్ - నాగార్జున కళాశాల వినూత్న అడుగు

Nalgonda: నల్లగొండ నాగార్జున కళాశాలలో పాత పుస్తకాలను రీసైక్లింగ్ చేసి కొత్త నోట్‌బుక్స్‌ను తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న అడుగు.

Saleem, Nalgonda
Published on: 5 Oct 2026 4:12 PM IST
Nalgonda
X

Nalgonda: పాత పుస్తకాలతో కొత్త నోట్‌బుక్స్ - నాగార్జున కళాశాల వినూత్న అడుగు

నల్గొండ: పర్యావరణ పరిరక్షణ, వనరుల పొదుపే లక్ష్యంగా నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాల ఫిజిక్స్ విభాగం, ‘యూత్ ఫర్ సేవా’ సంస్థ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కళాశాలలో వినియోగంలో లేని పాత రికార్డులు, నోట్‌బుక్స్‌ను సేకరించి రీసైక్లింగ్ ద్వారా కొత్త పుస్తకాలుగా మార్చారు.

​ఈ రీసైకిల్డ్ నోట్‌బుక్‌ను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఉపేందర్ ఆవిష్కరించారు. చెట్లను నరకకుండా కాగితాలను పునర్వినియోగించడం అభినందనీయమని, పేపర్ వృథాను అరికట్టేలా విద్యార్థుల్లో అవగాహన పెంచే ఇటువంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వృథా కాగితాల రీసైక్లింగ్ ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ హెచ్‌ఓడీ శ్రీనివాస్ రెడ్డి, 'యూత్ ఫర్ సేవా' జిల్లా ఇన్‌చార్జ్ నాగేందర్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda