Nakrekal: చందుపట్లలో ఘనంగా రాణి రుద్రమదేవి వర్ధంతి వేడుకలు!

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 27 Nov 2026 1:39 PM IST
Nakrekal
X

Nakrekal: చందుపట్లలో ఘనంగా రాణి రుద్రమదేవి వర్ధంతి వేడుకలు!

నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి వర్ధంతి సభ ఘనంగా జరిగింది. వివేకానంద యువజన మండలి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.​

కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన రుద్రమదేవి మహిళా శక్తికి ప్రతీక అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆమె ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి తరానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు.

ఆమె ఆశయాలను భావితరాలకు అందించడమే అసలైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల మాధవరెడ్డి, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ సహా కాంగ్రెస్ నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET