Nakrekal: విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగుల పంపిణీ: విప్ వేముల!
Nakrekal: నకిరేకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఉచిత స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
Nakrekal: విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగుల పంపిణీ: విప్ వేముల!
నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులను ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. సర్వ శిక్షా అభియాన్ (SSA) ఆధ్వర్యంలో “అందరూ చదవాలి – అందరూ ఎదగాలి” కార్యక్రమంలో భాగంగా యూనివర్సల్ ఫౌండేషన్, కోగ్టా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల సహకారంతో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యార్థులకు స్వయంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
విద్యాభివృద్ధికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కోగ్టా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.




