Nalgonda: నిరుద్యోగులకు SKSS ఉపాధి కల్పన అభినందనీయం: డీఎస్పీ!

Nalgonda: నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో ఎస్.కె.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శివరాంరెడ్డి నిరుద్యోగులకు దిశానిర్దేశం చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 3 Nov 2026 9:15 PM IST
Nalgonda
X

Nalgonda: నిరుద్యోగులకు SKSS ఉపాధి కల్పన అభినందనీయం: డీఎస్పీ!

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్.కె.ఎస్.ఎస్ (SKSS) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పొట్టిపాక నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నిరుద్యోగ యువత చెడు వ్యసనాలకు, ఈజీ మనీకి అలవాటు పడకుండా కష్టపడి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు.

స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఉద్యోగాలు కల్పించడం శుభపరిణామమని డిఎస్పీ అభినందించారు.ఫాక్స్‌కాన్, ఓరియంట్ ఎలక్ట్రిక్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి అంతర్జాతీయ కంపెనీలు పాల్గొని వందలాది మందికి ఉపాధి కల్పించాయి. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్, టూ టౌన్ ఎస్ఐ సైదా బాబు, ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET