Nalgonda: ఎన్హెచ్ఎం దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి మద్దతు!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న ఎన్హెచ్ఎం దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు.
Nalgonda: ఎన్హెచ్ఎం దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి మద్దతు!
నల్గొండ: నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం (NHM) జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని,మహిళా ఉద్యోగులకు 150 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన పోరాతంలో తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు.




