Nalgonda: చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాలి: కలెక్టర్ చంద్రశేఖర్!
Nalgonda: పానగల్లు ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వారసత్వ నడక (హెరిటేజ్ వాక్)ను నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రారంభించారు.
Nalgonda: చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాలి: కలెక్టర్ చంద్రశేఖర్!
నల్గొండ: పురాతన, చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం పానగల్లులోని ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద 'ఇంటాక్' తెలంగాణ చాప్టర్ నిర్వహించిన ‘వారసత్వ నడక’ (హెరిటేజ్ వాక్)ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గర్భగుడిలోని శివలింగంపై నిరంతరం పడే ఛాయ (నీడ) విశిష్టతను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.




