Nalgonda: భారీ గంజాయి రాకెట్ రట్టు డమ్మీ తుపాకీతో 9 మంది అరెస్ట్!
Nalgonda: నల్లగొండ మునుగోడు రోడ్డులో గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. 9 మంది అరెస్ట్, 5.6 కేజీల గంజాయి, డమ్మీ తుపాకీ, బైక్‌లు స్వాధీనం.
Nalgonda: భారీ గంజాయి రాకెట్ రట్టు డమ్మీ తుపాకీతో 9 మంది అరెస్ట్!
Nalgonda: నల్లగొండ జిల్లాలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా కేంద్రం సమీపంలోని మునుగోడు రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి 5.6 కేజీల గంజాయి, 10 ఎంఎల్ గ్రీడ్ ఆయిల్, 5 బైకులు, 4 సెల్‌ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక బటన్ కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి శివరాం రెడ్డి తెలిపారు.
దుండిగల్ వద్ద నాగరాజు, మధు, సుశాంత్ మరో వ్యక్తితో కలిసి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నారు. వీరు రెండు మోటార్ సైకిళ్లు దొంగిలించి ఒరిస్సాలోని పసుపులంకకు వెళ్లి, అక్కడ గంజాయి ముఠాకు బైకులు ఇచ్చి 12 కేజీల గంజాయి, 500 ఎంఎల్ గ్రీడ్ ఆయిల్ తెచ్చారు. దుండిగల్‌ను కేంద్రంగా చేసుకొని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విక్రయిస్తున్నారు.
500 ఎంఎల్ గ్రీడ్ ఆయిల్‌ను రూ.2,000 చొప్పున, చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లను రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన 9 మందిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు.
నిందితులు పట్టుబడే సమయంలో పోలీసులను బెదిరించేందుకు డమ్మీ తుపాకీని ఉపయోగించేవారని, ఏ-1, ఏ-2 నిందితులపై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు.పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలపై సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.




