Nalgonda: నల్లగొండ జిల్లా శెట్టిపాలెం వద్ద ఘోర ప్రమాదం!
Nalgonda: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ధాన్యం ట్రాక్టర్. డ్రైవర్, కండక్టర్ సహా 10 మంది ప్రయాణికులకు గాయాలు.
Nalgonda: నల్లగొండ జిల్లా శెట్టిపాలెం వద్ద ఘోర ప్రమాదం!
Nalgonda: వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ధాన్యం ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.




