Nalgonda: నల్లగొండలో సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 24 Jun 2026 4:38 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ ఆర్టీసీ బస్ స్టాండ్ విస్తరణ మరియు ఆధునీకరణ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేషన్ హోదాకు తగినట్లుగా నల్లగొండ నగరం విస్తరిస్తోందని, ప్రజల రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు నూతనంగా రెండు సిటీ బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఇవి చెరువుగట్టు నుంచి మెడికల్ కాలేజీ వరకు, దుప్పలపల్లి నుంచి పానగల్లు మీదుగా నల్లగొండ వరకు సేవలందిస్తాయని వెల్లడించారు.ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు.

​సుమారు కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో బస్టాండ్‌లో రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి, అదనంగా మరో 5 కోట్ల రూపాయలతో బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక జిల్లా ప్రత్యేక అధికారి, ఆర్టీసీ ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story